SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: సాఫ్ట్‌వేరోళ్లు సాఫ్ట్‌గా ఎస్కేప్ అవ్వాలనుకున్నారు.. పెట్టెలు పారేసి అడ్డంగా బుక్కయ్యారు..



బెంగళూరు ఏటీఎం క్యాష్ రీఫిల్ వెహికల్ దొంగతనం కేసుతో చిత్తూరు దొంగల లింకుల వ్యవహారం బయటపడింది. రూ 7.11 కోట్లు కొట్టేసిన ముఠా గుట్టు రట్టయింది. దొంగల ముఠా చిత్తూరు జిల్లాకు చెందినదిగా గుర్తించిన బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు కేసును చేదించారు.


బెంగళూరు ఏటీఎం క్యాష్ రీఫిల్ వెహికల్ దొంగతనం కేసుతో చిత్తూరు దొంగల లింకుల వ్యవహారం బయటపడింది. రూ 7.11 కోట్లు కొట్టేసిన ముఠా గుట్టు రట్టయింది. దొంగల ముఠా చిత్తూరు జిల్లాకు చెందినదిగా గుర్తించిన బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు కేసును చేదించారు. గుడిపాల మండలం 190 రామాపురం వద్ద చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారును గుర్తించిన కర్ణాటక పోలీసులు UP 4 BX 2500 నెంబర్ గల కారును ముఠా ఉపయోగించినట్లు తేల్చారు. చిత్తూరు జిల్లా పోలీసుల సహకారంతో ఆపరేషన్ సక్సెస్ చేశారు. కారు గుడిపాల మండలం చిత్తపార మీదుగా వెళుతున్నట్లు టెక్నాలజీ సహాయంతో గుర్తించారు. ఈనెల 19న బెంగళూరు సౌత్ ఎండ్ లో జరిగిన దోపిడీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా ఆరుగురు దొంగల ముఠా లో చిత్తపార గ్రామానికి చెందిన రవి ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. చిత్తపార గ్రామంలో రవి తండ్రి రామదాసును అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు. రవితోపాటు ముఠా సభ్యులు బుధవారం రాత్రి రెండు కార్లలో చిత్తపార గ్రామానికి వచ్చినట్లు తేల్చారు. కారు వద్ద క్లూస్ సేకరించిన కర్ణాటక పోలీసులు.. బెంగళూరు బ్యాంకు వ్యాన్ దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా దొంగల లింకులను నిర్ధారించారు. ఇద్దరు మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాల పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఈనెల 19న బెంగళూరు సౌత్ ఎండ్ కూడలిలో ఒక బ్యాంకు వ్యాన్ నుంచి రూ. 7.11 కోట్లు దోపిడీ లో గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన అన్నదమ్ములు పాత్రను బెంగుళూరు పోలీసులు తేల్చారు. చిత్తపారలో ఎక్స్ ఆర్మీ రామదాసును అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. దోపిడీ ముఠాలోని రామదాసు కొడుకులు రవి రాకేష్‌లు దోపిడీ చేసిన నగదు పెట్టెలను యూపీ రిజిస్ట్రేషన్ వాహనంలో సొంతూరుకి తరలించినట్లు గుర్తించారు.

బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న రవి తమ్ముడు రాకేష్‌తో కలిసి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో ఏర్పడ్డ పరిచయంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నాలుగు నగదు పెట్టెల్లో రెండింటిని పగలగొట్టి నగదు కాజేసిన అన్నదమ్ములు చిత్తపార నుంచి పల్లూరు వెళ్లే అటవీ మార్గం లోని కల్వర్టు కింద ఖాళీ పెట్టెలను పడేసి పరారీ అయినట్లు గుర్తించారు. నెట్వర్క్ రాని ప్రాంతంలో పడేసి పరారీ అయిన రవి రాజేష్ ల కోసం గాలిస్తున్న పోలీసులు తండ్రి రామదాసును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బెంగళూరు చోరీ సొమ్ము కుప్పం మండలంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చోరీ సొమ్ము కుప్పం మండలం కూర్మానిపల్లిలో ఉన్నట్లు అనుమానించారు. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. మాజీ సైనికోద్యోగి నాగరాజు కొడుకు నవీన్ ఇంట్లో నగదు భద్రపరిచినట్లు గుర్తించారు. రాత్రి గ్రామంలోకి ఎవ్వర్నీ అనుమతించకుండా సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు రూ. 5 కోట్ల దాకా రికవరీ చేసినట్లు తెలిసింది. మరోవైపు దోపిడీకి పాల్పడ్డ దొంగలను పట్టుకునేందుకు బెంగుళూరు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే ముఠావాడిన ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తపార నుంచి పరారీ అయినట్లు చెబుతున్నారు. సిగ్నల్స్ లేని ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి మరో వాహనంలో నిందితులు గుడియాత్తం, వేలూరు వైపు వెళ్లినట్లు సిసి ఫుటేజ్ లో గుర్తించారు.

Also Read

Related posts