ఒక నెల అద్దె ఆలస్యమైనా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే అదే ఇంట్లో ఉండటం అసంభవం. కానీ అనంతపురం గుత్తిలో అద్దె ఎగ్గొట్టేందుకు దంపతులు చేసిన పని మాత్రం కిరాతకాన్ని మించిపోయింది. పదివేల అప్పు… నెలలుగా బకాయి అద్దె… ఒత్తిడి పెంచిన ఇంటి యజమానిని ఈ లోకం నుంచి పంపించివేశారు దంపతులు.
మనం ఎవరింట్లో అయినా అద్దెకు ఉంటున్నామంటే.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మసులుకుంటాం.. ఎందుకంటే ఒక నెల అద్దె ఆలస్యమైనా…. ఇబ్బంది వచ్చి ఒక నెల ఇంటి అద్దె కట్టలేకపోయినా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి. కానీ అద్దె డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండడం సాధ్యమవుతుందా.. కుదరదు కదా. అందుకే అద్దె డబ్బులు ఎగ్గొట్టేందుకు…. ఏకంగా ఇంటి ఓనర్నే లేపేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు ఆ ఇంట్లో రెంట్‌కు ఉంటున్న దంపతులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాము, సాలమ్మ దంపతులు.. విజయలక్ష్మి అనే ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఓనర్ విజయలక్ష్మి దగ్గర అద్దెకు ఉంటున్న దంపతులు పదివేల రూపాయలు అప్పు తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని నెలలుగా అడ్డ కూడా చెల్లించడం లేదు. దీంతో ఇంటి ఓనర్ విజయలక్ష్మి…. అద్దెతో పాటు తన వద్ద అప్పుగా తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తుంది.
దీంతో అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులు… ఎలాగైనా ఇంటి అద్దె ఎగ్గొట్టేందుకు…. ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుతున్నారు. నవంబర్ 26వ తేదీన రాత్రి ఇంటి ఓనర్ విజయలక్ష్మిని…. అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులు…. ఇంట్లోనే గొంతు నులిమి అతి కిరాతకంగా చంపారు. అనంతరం విజయలక్ష్మి డెడ్ బాడీని గుంతకల్ మండలం వైటీ చెరువులో పడేశారు. పక్క ఇంట్లోనే ఉంటున్న నివాసముంటున్న విజయలక్ష్మి కుమారుడు తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ దంపతులను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. హత్య విషయం బయటపడింది.. ఇంటి అద్దె చెల్లించలేక.. అలాగే బదులుగా తీసుకున్న పదివేల రూపాయలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో… ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేసి మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు తీసుకుని చెరువులో పడేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇంటి అద్దె ఎగ్గొట్టేందుకు… ఏకంగా ఇంటి ఓనర్నే హత్య చేసిన రాము, సాలమ్మ దంపతులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





