ఓ హోటల్‌లో ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. ఆపై ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సీన్‌లోకి మూడోవాడు ఎంట్రీ ఇచ్చాడు. అంతే.! అదే ఆమె ప్రాణాల మీదకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
తెనాలి రాజుల కాలనీలో ఉష, విజయ్‌లు సహజీవనం చేస్తున్నారు. తన భర్తతో వివాదాల నేపధ్యంలోనే 15 ఏళ్లుగా ఉష విడిగా జీవిస్తోంది. తన భార్యకు దూరమైన విజయ్ ఒక హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో ఉష ఆ హోటల్‌లోనే పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే 2021లో తెనాలిలో హోటల్ మూతపడటంతో ఇద్దరూ కలిసి నందిగామ వెళ్లి అక్కడ పనిచేశారు. ఈ క్రమంలోనే ఉషకు మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె అతనితో సన్నిహితంగా ఉంటుందని భావించిన విజయ్ అతన్ని హత్య చేసి ఉషని గాయపరిచాడు. దీంతో విజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకి పంపించారు. దీంతో ఉష తిరిగి తెనాలి వచ్చి జీవిస్తోంది. జైలు నుంచి తిరిగి వచ్చిన విజయ్ మరోసారి ఉష వద్దకు వచ్చాడు. ఆమెను బ్రతిమలాడుకుని కలిసి ఉండేందుకు అనుమతి తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి మెలిసే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఉష తనకు అభిషేక్ అనే వ్యక్తితో పరిచయం అయిందని అతనితో ఉంటానని విజయ్‌కు చెప్పింది. దీంతో విజయ్ కోపంతో రగిలిపోయాడు. ఉష తనకు దక్కదన్న కోపంతో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఆమెతో ఘర్షణ పడ్డాడు. అనంతరం కత్తితో ఆమె ఒంటిపై పలు చోట్ల దాడి చేశాడు. ఆసుపత్రిలో చేర్చాలంటే.. ఉషపై దాడి చేసింది అభిషేకే అని చెప్పాలని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె అభిషేక్ పేరు చెప్పేందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అక్కడ తనపై దాడి చేసింది అభిషేకే అని ఉష చెప్పింది. అయితే ఆమెకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అభిషేక్ కోసం గాలిస్తుండగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అభిషేక్ ఫోన్ లోకేషన్ ట్రేస్ చేయగా.. కొన్నాళ్లుగా అతను హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విజయ్‌పై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు ఉష తల్లిని ప్రశ్నించగా దాడి జరిగిన రోజు ఇద్దరూ ఘర్షణ పడిన అంశాన్ని పోలీసులకు ఆమె చెప్పింది. దీంతో విజయ్ ఫోన్ లోకేషన్ ట్రేస్ చేయగా అదే రోజు విజయ్ అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





