అనంతపురం పట్టణంలో దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లిపై కోపంతో కొడుకును హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తన భార్యకు లేనిపోని మాటలు చెప్పి గొడవలు సృష్టిస్తుందని ఘాతుకానికి ఒడిగట్టాడు. పక్కింట్లో ఉండే అభం శుభం తెలియని పిల్లవాడిని హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోెలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం పట్టణంలో దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లిపై కోపంతో కొడుకును హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తన భార్యకు లేనిపోని మాటలు చెప్పి గొడవలు సృష్టిస్తుందని ఘాతుకానికి ఒడిగట్టాడు. పక్కింట్లో ఉండే అభం శుభం తెలియని పిల్లవాడిని హత్య చేశాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం పట్టణ అరుణోదయ కాలనీకి చెందిన నాలుగేళ్ల సుశాంక్ హత్య సంచలనం సృష్టించింది. అరుణోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పెన్నయ్య, పక్కింట్లో ఉండే హరి, నాగవేణి దంపతుల మూడో కుమారుడు సుశాంక్‌ను ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న పెన్నయ్య.. పక్కింట్లో ఉంటున్న నాగవేణి అనే మహిళ మీద ఉన్న కోపంతో ఆమె కుమారుడు నాలుగేళ్ల సుశాంక్ అనే బాలుడిని హతమార్చాడు.
అనంతపురం పట్టణం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో పెన్నయ్య, సావిత్రి దంపతులు.. హరి, నాగవేణి దంపతులు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు. కన్నయ్య భార్య సావిత్రి.. హరి భార్య నాగవేణి ఇద్దరు మంచి స్నేహితులు. ఆటో డ్రైవర్ పెన్నయ్య తాగి వచ్చి భార్య సావిత్రిని కొడుతూ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నేపధ్యంలో పక్కింట్లోనే ఉంటున్న నాగవేణి, పెన్నయ్య భార్య సావిత్రికి తనపై చెప్పుడు మాటలు చెప్పి.. భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుందని, నాగవేణిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 25వ తేదీన నాలుగేళ్ల బాలుడు సుశాంక్ తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. దీంతోటిఫిన్ తినడానికి సుశాంత్‌ను ఇంట్లోనే ఉంచి బయట గడియ పెట్టిన తల్లిదండ్రులు హరి, నాగవేణి బస్టాండ్‌కు వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో బస్టాండ్ నుంచి తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు సుశాంక్ కనిపించకుండాపోయాడు. ఇంట్లోనే వెనుక గదిలో ఉంటున్న నాయనమ్మ దగ్గర ఉన్నాడని భావించి హరి, నాగవేణి దంపతులు పడుకున్నారు. అయితే ఉదయం లేచి చూసేసరికి సుశాంక్ నాయనమ్మ దగ్గర లేకపోవడంతో, తమ కుమారుడు అదృశ్యమయ్యాడని హరి, నాగవేణి దంపతులు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి, బాలుడు మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అయితే పక్కింట్లో ఉంటున్న ఆటో డ్రైవర్ పెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆటో డ్రైవర్ పెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలుడు సుశాంక్ తల్లిపై ఉన్న కోపంతో అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేసినట్లు ఆటో డ్రైవర్ పెన్నయ్య పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన భార్యకు లేనిపోని మాటలు చెప్పి, కాపురంలో కలహాలు సృష్టిస్తుందని, బాలుడి తల్లి నాగవేణిపై కక్షతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులకు వివరించాడు పెన్నయ్య.
తల్లిదండ్రులు బాలుడిని ఇంట్లో ఒంటరిగా ఉంచిన విషయం తెలుసుకున్న పెన్నయ్య, గోడ దూకి ఇంటి తలుపులు తెరిచి బాలుడిని ఎత్తుకెళ్లాడు. బాలుడు సుశాంక్ గొంతు నులిమి చంపి, సంచిలో మూట కట్టి దోబీ ఘాటు వద్ద పడేసినట్లు నిందితుడు పెన్నయ్య పోలీసులు ఎదుట నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు దోబీ ఘాటు దగ్గరికి వెళ్లి చూడగా, సంచిలో బాలుడు శవమై కనిపించింది. కేవలం నాగవేణి మీద ఉన్న కోపంతోనే బాలుడిని నిందితుడు పెన్నయ్య కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలుడు మిస్సింగ్ కేసు కాస్త, మర్డర్ కేసుగా మారడంతో పోలీసులు నిందితుడు పెన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తన కుమారుడిని చంపిన ఆటో డ్రైవర్ పెన్నయ్యను ఎన్‌కౌంటర్ చేయాలని తల్లి నాగవేణి డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా పెద్దల మధ్య కక్షలు కార్పణ్యాలతో అభం శుభం తెలియని చిన్నారి బలి అయ్యాడు.
Also read
- వామ్మో జర్రుంటే నిండు ప్రాణం బలయ్యేది.. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. వీడియో
- Hyderabad: భర్త ఆటోడ్రైవర్.. మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. అర్థరాత్రి గుట్టుగా ఏం చేసిందంటే..
- ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు..! అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా మరో ప్రమాదం..
- హెడ్మాస్టర్ అండతో మరింత రెచ్చిపోయాడు.. అమ్మాయిల పట్ల అటెండర్ అసభ్య ప్రవర్తన.. చివరకు..
- గంజాయి మత్తులో బాటసారులను పరుగులు పెట్టించిన ఆకతాయికి దేహశుద్ధి!







 
					