SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: ఆ రాత్రి ప్రియుడి నుంచి కాల్ వచ్చింది.. ఆమె ఒంటరిగా వెళ్లగా



ఆ రాత్రి ఆమెకు ప్రియుడి నుంచి కాల్ వచ్చింది. అసలే వివాహేతర సంబంధం.. ఆపై రాత్రి 9 గంటలకు కాల్ చేశాడు. కోరిక వచ్చి అని అనుకునేరు.. ఈమె కూడా అలానే అనుకుని ఒంటరిగా వెళ్ళింది. కట్ చేస్తే.! ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వివాహేతర సంబంధం ఒక మహిళ హత్యకు కారణమైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి చేతిలోనే హత్యకు గురైంది. వివరాల్లోకెళ్తే ఈ నెల 17న మదనపల్లి మండలం సిటియం క్రాస్‌లోని సచివాలయం వెనుక వైపు ఖాళీ ప్రదేశంలో మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి మదనపల్లి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు సమీపంలోని పాకాలవీధిలో ఉంటున్న మహిళగా గుర్తించారు. గడ్డోళ్ళ అంజి భార్య 45 ఏళ్ల సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మగా గుర్తించారు. అక్కడే ప్రాధమికంగా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. సీన్ ఆఫ్ ఆఫన్స్‌ను పరిశీలించిన పోలీసులు పలువురిని విచారించారు. ఐదేళ్ల క్రితం భర్త అంజి చనిపోవడంతో బుజ్జమ్మ మదనపల్లిలోని పాకాల వీధిలో ఉంటోంది. భవనం నిర్మాణ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్న బుజ్జమ్మకు సమీప గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మేస్త్రి పని చేసే మంజునాథ్ తో చనువుగా ఉన్న బుజ్జమ్మ గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బుజ్జమ్మ, మంజునాథ్‌ల మధ్య ఈ మధ్యనే మనస్పర్ధలు రావడంతో ఆమె మరో మేస్త్రి వద్ద కూలీ పని కోసం వెళుతూ వస్తోంది.

దీంతో బుజ్జమ్మ తీరుపై అనుమానం పెంచుకున్న మంజునాథ్ పక్కా ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఈనెల 17న రాత్రి 9 గంటల సమయంలో బుజ్జమ్మ ఉంటున్న ప్రాంతానికి చేరుకుని ఫోన్ చేసి రమ్మన్నాడు. మంజునాథ్ రమ్మనడంతో బయటకు వెళ్లడానికి సిద్ధమైన బుజ్జమ్మ బహిర్భూమికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చింది. ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి చేరుకున్న బుజ్జమ్మ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంటికి వస్తుందిలే అనుకున్న నమ్మకంతో ఇంటి పక్కన ఉన్నవారు, బంధువులు నిద్రపోయారు. కట్ చేస్తే.! ఉదయానికంతా ఆ ప్రాంతంలో డెడ్ బాడీ కనిపించింది. ఎవరిని ఆరా తీస్తే బుజ్జమ్మ మృతదేహంగా తేలింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. బుజ్జమ్మ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిస్టరీని చేధించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సెల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించారు. బుజ్జమ్మ సెల్ ఫోన్ కొచ్చిన ఆఖరి కాల్ నిందితుడు ఎవరో తేల్చేసింది. మంజునాథ్ మొబైల్ నుంచి వచ్చిన ఆఖరి కాల్‌పై ఆరా తీసిన పోలీసులు హత్యకు గురైన బుజ్జమ్మకు మంజునాథ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. సమీప గ్రామం చెన్నాయనపల్లి కి చెందిన మేస్త్రి మంజునాథ్‌ను అనుమానితుడిగా భావిస్తూ అదుపులోకి తీసుకుని తమదైనా శైలిలో విచారించారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బుజ్జమ్మతో గొడవపడ్డ మంజునాథ్.. బుజ్జమ్మ మెడపై ఉన్న టవల్‌తోనే గొంతు బిగించి హతమార్చాడు. పోస్టుమార్టం నివేదికలోనూ హత్య చేరినట్లు తేలడంతో పోలీసులు మంజునాథ్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంజునాథ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉపాధి కోసం మరో మేస్త్రీ వద్దకు పనికి వెళ్లడంతో అనుమానం పెంచుకున్న మంజునాథ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు

Also Read

Related posts