March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime:  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను స్క్రూడ్రైవర్ తో పొడిచి.. ఆపై కత్తితో ఘోరం..


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీలో దారుణం చోటుచేసుకుంది. హేమంత్ అనే యువకుడు కట్నం కోసం ప్రేమించిన అమ్మాయినే చంపేందుకు సిద్ధపడ్డాడు. అత్యంత కిరాతకంగా ఆమెను స్క్రూడ్రైవర్ తో పొడిచి ఆపై కత్తితో దాడి చేశాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న విద్యార్థులు ఇది గమనించి ఆమెను కాపాడారు.

Crime:  ప్రేమించిన వాడిని గుడ్డిగా  నమ్మి.. అతడి కోసం  తల్లిదండ్రులను, కుటుంబాన్ని కాదని వెళ్ళిపోయింది. కానీ, చివరికి అతడే తన పాలిట యుముడవుతాడని ఊహించలేకపోయింది. ప్రేమించిన అమ్మాయిని స్క్రూడ్రైవర్  తో పొడిచి పొడిచి హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు కిరాతక భర్త. ఆమె అదృష్టం బాగుండడంతో ఆ దుర్మార్గుడి దాడి నుంచి బయటపడింది. ఈ దారుణ ఘటన తిరుపతిలోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.


అయితే తిరుపతి జిల్లాకు చెందిన  హేమంత్ కుమార్ అనే యువకుడు

పెద్దలను ఎదిరించి కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన లక్ష్మీ ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మి వెళ్లిన  లక్ష్మీ ప్రియకు పెళ్ళైన కొన్ని రోజులకే టార్చర్  టార్చర్ మొదలైంది. హేమంత్ ప్రియను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు.  కట్నం డబ్బులు తెస్తావా?  లేదా ఇంట్లో నుంచి తరిమేస్తానని పలు మార్లు ఆమెపై కొట్టాడు. దీంతో ప్రియా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటుంది. ఆ తర్వాత వివాహమైన సంవత్సరానికే ప్రియా మగబిడ్డకు జన్మనిచ్చింది.

https://x.com/AduriBhanu/status/1899455336983187614?t=ydRNvMFLZevKVEKJbdtpsg&s=19



అత్యంత కిరాతకంగా

ఈ క్రమంలో  గత నాలుగు నెలల కిందట ప్రియా దగ్గరికి వెళ్లిన హేమంత్ మరో కొత్త నాటకం మొదలు పెట్టాడు. నిన్ను బాగా చూసుకుంటాను, నాతో వచ్చేయ్.. మనం సెపరేట్ గా కాపురం పెడదాం అని నమ్మబలికి భార్యను తనతో తీసుకెళ్లాడు. శ్రీకాళహస్తీలో ఓ ఇంటిని అద్దెకు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిన్న మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్యపై దాడి చేశాడు హేమంత్. ఆ తర్వాత గాయపడిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి దారిలోనే ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గుంటా తోపు  వద్దకు తీసుకెళ్లి ఆమెను స్క్రూడ్రైవర్  తో పొడిచి ఆపై  కత్తితో దాడి చేశాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న కొందరు విద్యార్థులు ఇది గమనించి ప్రియను కాపాడారు. ప్రస్తుతం ప్రియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది



Also read

Related posts

Share via