SGSTV NEWS
Andhra PradeshCrime

Crime: లోన్ యాప్స్ ఎఫెక్ట్.. యువతి ఆత్మహత్యాయత్నం


లోన్ యాప్స్ వేధింపులు భరించలేక గుంటూరుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీశైలం శిఖరేశ్వరం అడవుల్లో 10 అడుగుల లోతులో దూకింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా యువతి ఆచూకీ లభ్యమైంది.

లోన్ యాప్‌లకు బాగా అలవాటు పడి ప్రాణాలు తీసుకున్న కేసులు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. అవసరానికి డబ్బులు లేవని లోన్ తీసుకోవడం ఆ తర్వాత సరైన సమయానికి కట్టరు. దీంతో వారు వేధింపులు పెట్టడం మొదలుపెడతారు. అటు డబ్బులు కట్టలేక, ఇటు వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గుంటూరు జిల్లాకి చెందిన ఓ యువతి కూడా ఇలానే లోన్ యాప్స్ నుంచి డబ్బులు వాడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది

పది అడుగుల ఎత్తు నుంచి..
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం  కలుకులూరు గ్రామానికి చెందిన  వెన్నెల.. శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర వెన్నెల అనే యువతి లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిన్న సాయంత్రం శిఖరేశ్వరం గోడ పైనుంచి 10 అడుగుల లోతులో ఉన్న అడవిలోకి దూకింది.

దీంతో రాత్రంతా ఆ శిఖరేశ్వరం అడవిలోనే గడిపింది. ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిన్నటి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు శిఖరేశ్వరం అడవిలో యువతిని శ్రీశైలం పోలీసులు గుర్తించారు. సురక్షితంగా యువతిని అడవి నుంచి తీసుకొచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసో తెలియక లోన్ యాప్స్‌‌లో డబ్బులు తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ వాడటం వంటివి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ఆ తర్వాత వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు

Also Read

Related posts