పెళ్లి సంబంధాల కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఓ యువతి చివరకు ఓ ఆన్ లైన్ స్కామ్ కు బలైంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ జ్యోతిష్యుడిని నమ్మి ఏకంగా రూ. 6 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత తన డబ్బు తనకిచ్చేయాలని ఆమె కోరగా.. అతడు కొత్త నాటకానికి తెరతీశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ రోజుల్లో జ్యోతిష్యం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. డబ్బుల కోసం వారు చెప్పే రెమిడీలను గుడ్డిగా నమ్మి ఎంతో మంది సమయాన్ని డబ్బులను వేస్ట్ చేసుకుంటున్నారు. మనం ఆన్ లైన్లో ఫాలో అవుతున్న వారి క్రెడిబిలిటీ ఏమిటి? వారు ఆ శాస్త్రంలో ఎంత అనుభవం పొంది ఉన్నారు.. వారి హిస్టరీ ఏమిటి అనే కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా పలువురు దగా పడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువతి కూడా ఇలాగే మోసపోయింది.
పెళ్లికి పూజలు చేయిస్తానంటూ..
తనకు పెళ్లి త్వరగా కుదరాలని ఓ జ్యోతిష్యుడిని నమ్మి అతడు చెప్పినదానికల్లా తలూపింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అతడు.. ముందు నీ జాతకంలో ఉన్న దోషాలు పోగొట్టడానికి పూజలు చేయాలని నమ్మించాడు. అందుకోసం రూ. 1820 రూపాయలు ఖర్చవుతుందన్నాడు. దీంతో వెంటనే ఆ మొత్తాన్ని అతడికి చెల్లించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె జాతకంలో మరిన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా పూజల పేరుతో మొత్తంగా రూ. 6 లక్షలు తీసుకున్నాడు. బాధితురాలు తన డబ్బును తనకు ఇచ్చేయాలని పట్టుబట్టడంతో ఆ జ్యోతిష్యుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
ఇలా బయటపడింది..
తన స్నేహితుడైన ప్రశాంత్ అనే వ్యక్తిని అడ్వొకేట్ గా ఆమెకు పరిచయం చేశాడు. ఆమె తిరిగి డబ్బు డిమాండ్ చేస్తూ ఉంటే తనను తాను గాయపరచుకుని తన ఆత్మహత్యకు ఆమెనే నిందిస్తానని బెదిరించాడు. అంతేకాకుండా, బాధితుడికి కుమార్ న్యాయవాది అని చెప్పుకునే ప్రశాంత్ అనే వ్యక్తి నుండి కాల్స్ వచ్చాయి. ఆర్థిక ఒత్తిడి కారణంగా కుమార్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని బాధితురాలని మరింత మోసగించాడు. తాను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నానని ఆత్మహత్య చేసుకుంటానని ఆ వ్యక్తి ద్వారా బాధితురాలని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఖంగుతిన్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంటనే, బాధితురాలు అధికారుల వద్దకు వెళ్లి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం మరియు ఐపీసీ సెక్షన్ 318 కింద మోసం చేసినందుకు కేసు నమోదు చేసింది. పరారీలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలోని వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు