ట్రక్కుతో మట్టిని తెచ్చిన కొందరు వ్యక్తులు.. ఇద్దరు మహిళలపై పోసి పూడ్చేందుకు ప్రయత్నించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రక్కుతో మట్టిని తెచ్చిన కొందరు వ్యక్తులు.. ఇద్దరు మహిళలపై పోసి పూడ్చేందుకు ప్రయత్నించారు. స్పందించిన స్థానికులు వారిని రక్షించిన ఘటన రీవా జిల్లాలోని హినౌతాలో వెలుగు చూసింది. అయితే, భూ వివాదం క్రమంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
Also read :గుర్తుపెట్టుకో! ఎల్లకాలం ఇదే మాదిరిగా సాగదు.. రచ్చరచ్చ చేసిన జగన్
మన్గావా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే, దానిని వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు. ఆ భూమిని తాము లీజుకు తీసుకున్నామని వాదిస్తూ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also read :*మీ భర్త ఎవరో చెప్పండి.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు*
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనను ధ్రువీకరించిన స్థానిక పోలీసులు.. ఈ దారుణ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ విమర్శించారు. మహిళలపై నేరాలు మధ్యప్రదేశ్లోనే నమోదవుతున్నాయన్న ఆయన.. వారికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also read :మిర్చి లారీని ఆపిన పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..