కడప జిల్లాలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదని పిచ్చెక్కిపోయిన కులయప్ప అనే ప్రేమోన్మాది షర్మిల అనే యువతి ఇంటికెళ్ళి మరీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మొత్తం 14సార్లు పొడిచాడు.
కడపజిల్లా వేముల మండలం కొత్తపల్లిలో షర్మిల అనే అమ్మాయిని కులయప్ప అనే యువకుడు ప్రేమించాడు. అయితే షర్మిల ఆ అబ్బాయిని ప్రేమించలేదు. దీంతో కులయప్ప రెచ్చిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల పై కులయప్ప కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని చూసి కులయప్ప పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం చుట్టుపక్కల వారు, బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో యువతి..
షర్మిల శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. షర్మిల అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పులివెందుల నుంచి కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి వీఆర్ఏగా పనిచేస్తూ రెవెన్యూ గ్రామసభలు కోసం గొందిపల్లెకు వెళ్లారు. తల్లి కూలి పనికి వెళ్లడంతో దాడి సమయంలో ఇంట్లో షర్మిల ఒక్కతే ఉంది. ఇదే అదునుగా భావించిన ఉన్మాది.. ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం షర్మిల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కత్తిపోట్లు ఎక్కువ ఉండడం, బాగా రక్తం పోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





