July 1, 2024
SGSTV NEWS
CrimeNational

Social Media: ఇదేందిది.. అక్కడ చిలుక ని తాకితే డబ్బులు హుష్‎కాకి.. కొత్త తరహా మోసం

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్థులు.. గతంలో సైబర్ ఫ్రాడ్ అనగానే కేవైసీ ఫ్రాడ్ ఎక్కువగా వినిపించేది. అదికాస్త ఇప్పుడు జాబ్ ఫ్రాడ్ అంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు నేరగాళ్లు. అయితే సైబర్ అంశాలపై మీడియాలో తరచు వార్తలు వినిపిస్తున్నా సైబర్ నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. రోజుకో కొత్త తరహా పంతాలో నేరాలకు పాల్పడుతునే ఉన్నారు కేటుగాళ్ళు. ఇటీవల కాలంలో మరోకొత్త తరహా మోసాలకు పాల్పడి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో యాడ్ రూపంలో లింకులను పెట్టి వాటిని క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించి డబ్బులను కొల్లగొడుతున్నారు. అది ఎలా అంటే ఈ స్టోరీ చదవండి.



ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ వాడని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈ యాప్స్ వాడే వారికి చిలుక కనిపించేలా ఒక యాడ్ ఇప్పటికే చూసుంటారు. పొరపాటున ఆ యాడ్‎ను క్లిక్ చేశారా అంతే సంగతి. మీ అకౌంట్లో ఉన్న డబ్బు మాయం. ఎక్కువగా ఈ యాడ్ ఫేస్‎బుక్‎లో చెక్కర్లు కొడుతుంది. ఈ యాడ్ తాకి చూడుముము మంత్రము కనిపిస్తుంది అంటూ చిలుక బొమ్మతో ఒక యాడ్ కనిపిస్తుంది. ఆ బొమ్మను క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ ఇండియా కు సంబంధించిన భారత్ జన్ధన్ యోజన ద్వారా భారతదేశ ప్రజలకు ఉచితంగా 5000 రూపాయలు మీ ఎకౌంట్లో జమ అవుతుంది అని ఒక ప్రకటన కనిపిస్తుంది. ఆ ఐదు వేల రూపాయలను పొందాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్క్రాచ్ కార్డుని స్క్రాచ్ చేస్తే డబ్బులను పొందవచ్చు అని ఉంటుంది. స్కాచ్ చేసిన తరువాత 4,999 రూపాయలు పొందారు అని చూపిస్తుంది. అలా వచ్చిన డబ్బులను పొందాలంటే ఫోన్ పే గూగుల్ పే తో సహా పలు బ్యాంక్‎కు సంబంధించిన పేర్లను సైతం ఆ యాడ్‎లో కనిపిస్తాయి.

అలా వచ్చిన డబ్బులని క్రెడిట్ చేసుకోవాలంటే ఓటిపి లాంటివి బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేయడంతో వచ్చిన డబ్బులు పొందడమే కాకుండా తిరిగి డబ్బులను పోగొట్టుకుంటున్నారు బాధితులు. ఈ విధంగా కొత్త తరహా పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని ఫిషింగ్ మెయిల్స్ అని అంటారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసిపి శివ మారుతి తెలిపారు. ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశతో రకరకాల లింకులను క్లిక్ చేసి ఓటీపీలు ఎంటర్ చేయడం వల్ల బాధితులు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇచ్చేముందు అఫీషియల్‎గా అనౌన్స్ చేస్తారని తెలిపారు పోలీసులు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేకుండా ఇటువంటి వాటిని వైరల్ అవుతున్నవన్నీ సైబర్ మోసాలకు పాల్పడేవారని గుర్తుంచుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు

Also read

Related posts

Share via