July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్..!

Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.


Bhuvanagiri School : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘీక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న భువనగిరిలోని గురుకులాన్ని ఎన్‌సీఎస్‌సీ బృందం సందర్శించనుంది. అంతేకాదు.. ఫుడ్‌పాయిజన్‌ బాధితులు, విద్యార్థులు, చనిపోయిన ప్రశాంత్‌ కుటుంబ సభ్యులను అధికారులు కలవనున్నారు. దర్యాప్తు అనంతరం ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రానికి ఎన్‌సీఎస్‌సీ బృందం నివేదిక సమర్పించనుంది.

ఏప్రిల్ 12న భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగా 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రశాంత్ అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందాడు. ప్రస్తుతం మిగిలిన విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. ఫుడ్ పాయిజన్‌పై కేంద్రానికి నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందం నివేదిక ఇవ్వనుంది.

Also read

Related posts

Share via