బెంగళూరులో ఓ గర్భిణీ వివాహిత తన ప్రియుడి నిరాకరణతో ఆత్మహత్య చేసుకుంది. 24 ఏళ్ల వినుతకు బాలరాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండటంతో భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినుత చనిపోకముందు బాలరాజుకు అనేక ఫోన్లు చేసిందని పోలీసులు గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం భర్తపైనే అనుమానం వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కాపురాలే కాదు, నిండు జీవితాలే నాశనం అవుతున్నాయి. ఓ వివాహిత తన ప్రియుడి కోసం కన్నబిడ్డను, కట్టుకున్న భర్తను మర్చిపోయి తన ప్రాణాలను తీసుకుంది. ఆమె మరణంతో ఇప్పుడు ఆ పిల్లాడు తల్లిలేని పిల్లాడిగా మారాడు. పైగా ఇంకో విషాదకరమైన అంశం ఏంటంటే.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత గర్భిణి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరులోని దేవనహళ్లికి 24 ఏళ్ల వినుతకు చిక్కబళ్లాపూర్ తాలూకాలోని గంగరేకలువే నివాసి సతీష్‌కు గతంలో వివాహం అయింది. సతీష్ వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న క్రమంలో ఫిబ్రవరి 28 రాత్రి, భర్త ఇంట్లో లేని సమయంలో, వినుత తన బెడ్ రూమ్ లో ఉరివేసుకొని చనిపోయింది. అయితే ఆమె మృతికి బాలరాజు అనే వ్యక్తి కారణం అని, తన భార్యకు, బాలరాజుకు వివాహేత సంబంధం ఉందంటూ భర్త సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు బాలరాజుకు అనేకసార్లు ఫోన్లు చేసినట్లు గుర్తించారు. ఇంటికి రావాల్సిందిగా ఆమె అనేక మార్లు కోరడం, అందుకు బాలరాజు అంగీకరించకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలి కొడుకు స్వయంగా పోలీసులకు తన తల్లి ఉరి వేసుకుందని సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకోవడం గమనార్హం. అయితే మృతిరాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్నిని అల్లురు సతీష్ చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బాలరాజుపై కూడా వారు ఫిర్యాదు చేశారు. భర్త సతీష్, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..