ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది.

లఖ్నవూ: స్నేహితుడి ప్రీవెడ్డింగ్ పార్టీలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం బరేలీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఆదివారం ఓ వ్యాపారవేత్త కుమారుడి ప్రీవెడ్డింగ్ పార్టీ ఘనంగా నిర్వహించారు. వరుడి స్నేహితుడు రిదిమ్ అరోరా, అదే హోటల్కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పరస్పరం దాడికి దిగారు. దీంతో రిదిమ్ తన తండ్రి, టెక్స్టైల్ వ్యాపారి అయిన సంజీవ్ అరోరాకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించాడు.
అక్కడికి చేరుకున్న యువకుడి తండ్రి ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. సార్థక్ అగర్వాల్పై దాడి చేసి హోటల్ టెర్రస్ పైనుంచి కిందకు తోశాడు. అంతటితో ఆగకుండా మరో యువకుడిపై దాడి చేశాడు. కింద పడిన సార్ధక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, అందరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025