October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

యల్లనూరులో కీచక టీచర్



• కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు భాస్కర్నాయక్ వికృత చేష్టలు

• తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు

• ఆ టీచర్ ను విధులకు రానివ్వొద్దంటూ బాధితుల ఆందోళన

• తాత్కాలికంగా కీచకుడిని తప్పించిన మోడల్ స్కూల్ ఏడీ

• ఆలస్యంగా వెలుగులోకి ఘటన



యల్లనూరు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో
పాఠశాలలకు పంపుతుంటారు. అలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ కట్టుతప్పాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను వేధిస్తూ పైశాచికానందం పొందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని చిలమకూరు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా భాస్కర్నాయక్ పనిచేస్తున్నాడు.

కొన్ని రోజులుగా ఇతను 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాకకూడని చోట తాకుతూ వికృతానందం పొందుతున్నాడు. ఈ క్రమంలో విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహం చెందిన వారు.. వారం క్రితం పాఠశాలకు చేరుకుని ఎంఈఓ చంద్రశేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్ను నిలదీశారు.

అయితే, విషయం బయటకు తెలియకుండా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు భాస్కర్నాయక్పై డీఈఓ వరలక్ష్మి, మోడల్ స్కూల్ ఏడీ నాగరాజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి విధులకు రావొద్దని ఆదేశించారు. వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని తెలియజేసినట్లు సమాచారం. అయితే, భాస్కర్నాయక్ను విధుల నుంచి తొలగించాలని విద్యార్ధినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మహేష్ను సంప్రదించగా, వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్ను విధులకు రానివ్వలేదని చెప్పారు.

Also read

Related posts

Share via