దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్ లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. దంపతుల మధ్య గత నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం మమత ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చింది.
Also read :పెళ్లికి నిరాకరించడనే కోపంతో ప్రియుడి పురుషాంగాన్ని కట్ చేసిన యువతి… వీడియో
దీంతో ఆగ్రహం పట్టలేని లోకనాథ్ భార్యపై కత్తితో దాడిచేసి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల క్రితం హాసన్ శివారులోని చెన్నపట్టణ కాలసీ నివాసి అయిన మమతను కేఆర్పుర నివాసి లోకనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కట్నం కింద అరకేజీ బంగారం, రూ.50 లక్షలు నగదు ఇచ్చినా లోకనాథ్ తరచూ అదనపు కట్నం కోసం మమతను వేధించేవాడని, అయితే ఆమె కట్నం తీసుకురావడానికి నిరాకరించేదని అందుకే లోకనాథ్ ఈ హత్యకు పాల్పడ్డాడని మమత తల్లిదండ్రులు ఆరోపించారు. హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ ఆఫీసులోనే, పోలీసు హత్య చేయడంపై విమర్శలు వెల్లువత్తాయి.