వికారాబాద్: ఇంట్లో అత్త తో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లా ఖాన్పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025