చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న భార్య దివ్య సంచలన ఆరోపణలు చేసింది. తాను బిడ్డకు జన్మనిచ్చిన వారంలోనే తనతోపాటు ఫ్రెండ్స్‌తోనూ శృంగారం చేయమని ప్రసన్న టార్చర్ చేసినట్లు చెప్పింది. అతనితో పెళ్లి జీవితంలో మరిచిపోలేని పీడకలగా మిగిలిందని కన్నీరుపెట్టుకుంది.
Prasanna Sankar: టెక్ బిలియనీర్ ప్రసన్న శంకర్ ఫ్యామిలీ వివాదంలో మరిన్ని భయంకర నిజాలు బయటపడుతున్నాయి. గతంలో తన భార్యపై ప్రసన్న వివాహేతర సంబంధాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దివ్య సైతం ఇంట్లో జరిగిన దారుణాలను బయటపెట్టింది.
ఈ మేరకు వీరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. అయితే ప్రసన్నతో పెళ్లి తన జీవితంలో మరిచిపోలేని పీడకలగా మిగిలిందని తాజాగా దివ్య కన్నీరుపెట్టుకుంది. తమకు అబ్బాయి పుట్టిన వారంలోనే శృంగారంలో పాల్గొనాలంటూ వేధించినట్లు తెలిపింది. అంతేకాదు తాను ఒప్పుకోకపోతే మరో మహిళ దగ్గరకు వెళ్తానని, కావాలంటూ ఇంటికి కూడా తెచ్చుకుంటానంటూ భయాందోళనకు గురిచేసినట్లు చెప్పింది. ఈ విషయంలో గొడవపెట్టుకున్నందుకు టార్చర్ చేసిన ప్రసన్న మరింత దిగజారిపోయినట్లు వాపోయింది. తన మాట వినట్లేదని, తన ఫ్రెండ్స్‌తో పడుకోమంటూ దారుణంగా హింసించాడని చెప్పింది. ప్రస్తుతం దివ్య ఆరోపణలకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఇదిలా ఉంటే.. గతంలో చెన్నైకు చెందిన ప్రసన్న తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. పలు సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా నానా హంగామా చేశాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025