హైదరాబాద్‌లో మరో ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన అతడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన మియాపూర్‌లోని మదీనగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జరిగింది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు
ప్రస్తుత సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. సమాజం పట్ల నీతి నిజాయితీ, గౌరవం వంటి ఎన్నో మంచి బుద్దులు నేర్పించాల్సింది పోయి దారుణానికి పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఇప్పటికే ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. స్కూళ్లలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంతో మంది ఉపాధ్యాయులు కటకటాల పాలయ్యారు. విద్యా బుద్దులు నేర్పించడం మానేసి వారిని అసభ్య పదజాలంతో పిలిచి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారు. కాదు కూడదని చెప్పిన విద్యార్థినులపై కక్షగట్టి పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థినులు వారి బాధను ఇంట్లో వారికి చెప్పుకోలేక ఎంతో కుమిలిపోతున్నారు.
అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినికి చదువు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మియాపూర్‌లోని మదీనగూడ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థినికి ప్రేమ వేధింపులు వచ్చాయి. ఆ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు