హైదరాబాద్ లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం పోసి మందుబాబులను దారుణంగా మోసం చేస్తున్నారు. బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్& ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ట్రూప్స్ బార్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని ఎక్సైజ్ అధికారులు ఇటీవల తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది.
రూ. 2690 ధర గల జేమ్సన్ బాటిల్లో
ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం కలుపుతూ బార్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. రూ. 2690 ధర గల జేమ్సన్ బాటిల్లో రూ.1000 ధర కలిగిన ఓక్స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. కల్తీకి రెడీగా ఉంచిన 75 తక్కువ ధర మద్యం సీసాలు, 55 ఖాళీ సీసాలను అధికారులు సీజ్ చేశారు. బార్ లైసెన్స్, ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసిన అధికారులు లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో వారిని అప్పగించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025