సెల్ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం దుండిగల్ తండాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్: సెల్ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ పరిధిలోని దుండిగల్ తండాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండా2లో శాంత (50) అనే మహిళ పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ జీవనం సాగించేది. శుక్రవారం దుకాణం పక్కనే ఆమె విగతజీవిగా పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసినట్లు అనుమానించి, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ పుటేజీ ఆధారంగా రావుల కమల్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తొలుత నిందితుడు మొబైల్ ఛార్జర్ కోసం శాంతతో గొడవ పడ్డాడు. ఆమె అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో వెనక్కి నెట్టేశాడు. ఆమె వీపుభాగంలో బలంగా గాయమైంది. కేకలు పెడుతోందని భయపడి ఆమెకు ఊపిరి ఆడకుండా ముక్కు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. నేరం అంగీకరించిన అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!