రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన అన్న క్యాంటీన్లు
గుడివాడలో క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు
ఎస్బీఐలో అన్న క్యాంటీన్ అకౌంట్
ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో కేవలం రూ. 5కే టిఫిన్, లంచ్, డిన్నర్ దొరుకుతాయి. మరోవైపు అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఎంతో మంది పేదలు తినడానికి తిండి లేక పస్తులు పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపుతున్నామనే సంతోషం తనకు ఉందని చెప్పారు.
పేదలకు అన్నం పెట్టే ఈ మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ వంతుగా ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు.
అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలు:
బ్యాంకు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ పేరు – అన్న క్యాంటీన్
అకౌంట్ నెంబర్ – 37818165097
IFSC – SBIN0020541
బ్రాంచ్ – చంద్రమౌళి నగర్, గుంటూరు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025