SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్

హైదరాబాద్: సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వడానికి బాధితుడి నుంచి సుధాకర్ రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతలో రూ.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. రెండో విడతలో గురువారం రూ.3 లక్షలు, మిగిలిన నగదు శనివారం ఇచ్చేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు. ఈక్రమంలో సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో బాధితుడు రూ.3 లక్షలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ సిబ్బందిని గుర్తించి నగదు బ్యాగ్ వదిలేసి ఇన్స్పెక్టర్ సుధాకర్ పరారయ్యాడు. సినీఫక్కీలో వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Related posts