SGSTV NEWS
CrimeTelangana

బాలికలతో కేర్‌టేకర్‌ అనుచిత ప్రవర్తన 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్‌టేకర్‌ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్‌పూర్‌లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also read

Related posts

Share this