Hyderabad : హైదరాబాద్ బాచుపల్లిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతేకాదు మరో యువకుడు సైతం ఆమెను ఇబ్బందిపెట్టాడు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీటెక్ విద్యార్థినిపై క్లాస్ రూమ్‌లోనే ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియోలు, ఫొటోలు తీసి.. పలుమార్లు బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించేందుకు ట్రై చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఒక యువతి.. బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆశిష్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజులకు యువతికి ఆశిష్ ప్రపోజ్ చేశాడు.
2023లో బెదిరించి కాలేజీలోనే ఒక క్లాస్ రూమ్‌లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమయంలో కాలేజీ సిబ్బంది యువకుడిని పట్టుకున్నా.. చర్యలు తీసుకోకుండా వదిలేశారని బాధితురాలు వెల్లడించింది. ఆ తర్వాత తనను బెదిరిస్తూ అనేకసార్లు అత్యాచారం చేసినట్టుగా వివరించింది. అంతేకాదు ఓయో రూమ్‌కి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి, స్పృహ కోల్పోయాక దుస్తులు లేకుండా.. వీడియోలు, ఫొటోలు తీసినట్టుగా తెలిపింది. వాటిని డార్క్ వెబ్‌లో పెడతానని బెదిరించినట్టుగా ఫిర్యాదు చేసింది.
ఓ వైపు ఇదంతా జరుగుతుండగానే.. ప్రవీణ్ అనే యువకుడిని యువతికి ఆశిష్ పరిచయం చేశాడు. ప్రేమ పేరుతో ఆశిష్ తనను మోసం చేసినట్టుగా విషయాన్ని ప్రవీణ్‌తో చెప్పింది యువతి. ప్రవీణ్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు కూడా ప్రయత్నించాడు. తప్పించుకుని బయటపడింది.
వీడియోలు, ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు తాను చెప్పినట్టుగా వినాలని ఆశిష్ బెదిరిస్తూ వస్తున్నాడు. వేధింపులు చేస్తూనే ఉన్నాడు. ఇక తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకువచ్చింది. తన పేరెంట్స్ కాలేజీ యాజమాన్యాన్ని ఈ విషయం గురించి అడిగినా స్పందన లేదని బాధితురాలు చెబుతోంది.
ఫిబ్రవరి 28వ తేదీన బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. పోలీసులు ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.
Also read
- శివుని ఆజ్ఞతో తనను తానే తిన్న రాక్షసుడు- ఎలా ‘మకరతోరణం’గా మారాడో తెలుసా?
- బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే అత్యాచారం.. ఓయోకు తీసుకెళ్లి మత్తు ఇచ్చి వీడియోలు, ఫొటోలు!
- Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..
- ఏంట్రా ఇలా ఉన్నారు.. బతికుండగానే 39 మందిని చంపేశారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా..
- స్కానింగ్ సెంటర్ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ బాలిక.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!




