April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రొద్దుటూరులో యువకుడి దారుణ హత్య

ముక్కలుగా నరికి… సంచుల్లో తరలించి
ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి.. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి రెండు సంచుల్లో నింపి.. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనంలో తరలించి పట్టణ శివారులో పడేసిన ఘటన సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో వెలుగుచూసింది.

ప్రొద్దుటూరు : ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి.. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి రెండు సంచుల్లో నింపి.. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనంలో తరలించి
పట్టణ శివారులో పడేసిన ఘటన సోమవారం
ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో
వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. వైఎంఆర్ కాలనీకి చెందిన నాగరత్నమ్మ అలియాస్
రత్నమ్మ భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. ఆమెకు వెంకట మహేశ్వర రెడ్డి (30) అనే కుమారుడు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన భూమిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమెకు పరిచయమవడంతో వారు సహజీవనం చేస్తున్నారు. అతను స్వీట్స్ తయారీతో
పాటు క్యాటరింగ్ చేస్తుంటాడు. వీరు ముగ్గురూ ఒకే
ఇంట్లోనే ఉన్నారు. మహేశ్వరరెడ్డి భారతి సిమెంటు
పరిశ్రమలో పనిచేసేవాడు. మహేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డిలకు మద్యం తాగే అలావాటు ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి డబ్బు విషయంగా వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లోని మొదటి గదిలో మహేశ్వరరెడ్డి పడుకోగా.. మరో గదిలో అనారోగ్యం కారణంగా ఎప్పటిలాగే ఉదయం వరకు మెలకువరాని ఓ ఇంజక్షన్ వేసుకుని రత్నమ్మ నిద్రపోయారు. ఈ క్రమంలో ఇంట్లో బెడ్పై పడుకుని ఉన్న మహేశ్వరరెడ్డిని రామచంద్రారెడ్డి గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత గొడ్డలి, మరో కత్తితో శరీర భాగాలను ముక్కలుగా చేసి రెండు సంచుల్లో నింపాడు. సోమవారం ఉదయం ఈ సంచుల్ని ద్విచక్ర వాహనంలో పెట్టుకుని వెళ్లాడు. గంట అనంతరం ఇంటికొచ్చి రత్నమ్మకు టిఫిన్ ఇచ్చి వెళ్లాడు. బెడ్, ఇంట్లో రక్తపు మరకలు ఉండటంతో రత్నమ్మ పోలీసులకు చెప్పారు. డీఎస్పీ మురళీధర్, సీఐలు వెంకటరమణ, అబ్దుల్ కరీం, సిబ్బంది వచ్చి ఇంట్లో గొడ్డలి, కత్తి, కొన్ని శరీర భాగాలు గుర్తించారు. శవం కనిపించలేదు. దీంతో ఊరంతా గాలించారు.
Also read :మరిదితో వివాహేతర సంబంధం!.. చివరకు ఏం జరిగిందంటే?
రామచంద్రారెడ్డి రెండు సంచులతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడం పోలీసులు గుర్తించారు. ఆ సంచులను ఎక్కడ దింపాడనేది తెలియలేదు. డ్వాగ్ స్వ్కాడ్ కూడా గుర్తించలేదు. సాయంత్రానికి చిన్నశెట్టిపల్లెరోడ్డులోని మైలవరం ఉత్తర కాలువ వద్ద శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో డీఎస్పీ, సీఐలు హతుడి శరీర భాగాలు గుర్తించి స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడు రామచంద్రారెడ్డి పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

Also read :వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి

Related posts

Share via