బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దాంతో.. ఏఫ్రిల్ 13, 14, 15 తేదీల్లో కవితను కస్టడీకి తీసుకోనుంది సీబీఐ. అలాగే.. కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో కాసేపట్లో కవితను సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. ఇక, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలిసేందుకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను అనుమతి ఇచ్చింది ఢిల్లీ కోర్టు.
మరోవైపు.. కవితకు ఢిల్లీ కోర్టులో వరుసగా నిరాశ ఎదురవుతోంది. కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు వేయగా.. ఆ రెండింటినీ తిరస్కరించింది.
దక్షిణ భారతదేశానికి చెందిన ఒక మద్యం వ్యాపారి లైసెన్స్‌లను పొందేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని, AAP మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్ విజయ్ నాయర్‌తో సహా కవిత ఇతరుల ద్వారా చెల్లింపులను సమన్వయం చేసుకోవాలని చెప్పారని సీబీఐ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కవితను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది ఢిల్లీ కోర్టు. ఇక సీబీఐ కస్టడీ, అరెస్ట్‌పై కవిత పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మార్చి నెలలో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు కవితను మూడు రోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కస్టడీకి పంపింది. సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఆమె గతంలో ఏప్రిల్ 23 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం సాయంత్రం సీబీఐ అరెస్ట్ చేసింది.
మద్యం లైసెన్సుల కోసం ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు లంచం ఇచ్చే పథకంలో సాక్షి స్టేట్‌మెంట్‌లు, వాట్సాప్ చాట్‌లు, ఆర్థిక పత్రాలు ఆమెను ప్రధాన కుట్రదారు అని వాదిస్తూ, ఐదు రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం