గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నీలకం ఠేశ్వరపురానికి చెందిన కోలాజోషి(17) తన ఇంటికి సమీపంలోని పుల్లేరులో స్నానానికి దిగి లోపలికి వెళ్లి పడిపోయాడు. కాల్వలో నీరు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఇద్దరు షాంపూ కొనేందుకు వెళ్లగా ఒక్కడే స్నానం చేస్తున్నాడు. చివరి నిమిషంలో జోషి చేతులు పైకి ఎత్తడంతో సమీపంలోని వారు గుర్తించారు. అప్పటికే గల్లంతవ్వడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు.
వీఆర్వో కోటప్రోలు ప్రకాశ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుడివాడ అగ్నిమాపక సిబ్బంది, విజ యవాడ నుంచి ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బలగాలు వచ్చి తాత్కాలిక గాలిబోట్లు, లైఫ్ జాకెట్లతో గాలింపు చేపట్టగ జోషి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు….. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!