April 19, 2025
SGSTV NEWS
Crime

Borugadda: అరండల్ పేట స్టేషన్ లో ఏం జరుగుతోంది?



బోరుగడ్డ అనిల్ కుమార్.. ఓ రౌడీషీటర్. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉచ్ఛనీచాలు మరిచి దూషణలు.. అసభ్య సంకేతాలతో ప్రముఖులను దూషించి పైశాచికానందం పొందినట్టు కేసులున్నాయి. డబ్బుల కోసం బెదిరించిన కేసులో అరెస్టయ్యారు.

రౌడీషీటర్ బోరుగడ్డకు అడ్డాగా మార్చేశారా?

రిమాండ్ ఖైదీతో సిబ్బంది కుమ్మక్కయ్యారా?

వరుస వీడియోలతో కలకలం

ఇది చేతకాని.. చేవలేనితనమనుకోవాలా…? ఎవరికో మేలు చేయడానికి ఏదో ఆశించి.. తీసుకుని.. చట్టాన్ని తుంగలో తొక్కేశారనుకోవాలా…? పోలీస్ స్టేషనన్ను ఓ రౌడీషీటర్ కు అడ్డాగా మార్చేశారనుకోవాలా…?

గుంటూరు నగరంలోని అరండల్పేట స్టేషన్ లో వ్యవహారాలు చూస్తే ఎన్నో సందేహాలు.. అక్కడసలు పోలీసింగ్ ఉందా? అన్న అనుమానాలు? అక్కడేం జరుగుతోందో తెలుసుకునే తీరికే ఉన్నతాధికారులకు లేదా అన్న ప్రశ్నలకు సమాధానాలే …

దారితప్పిన స్టేషన్ అధికారులను గాడిన పెట్టే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్నది ప్రశ్న.

బోరుగడ్డ అనిల్ కుమార్ .. & రౌడీషీటర్. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉచ్ఛనీచాలు మరిచి దూషణలు.. అసభ్య సంకేతాలతో ప్రముఖులను దూషించి పైశాచికానందం పొందినట్టు కేసులున్నాయి. డబ్బుల కోసం బెదిరించిన కేసులో అరెస్టయ్యారు. గత వైకాపా ప్రభుత్వం పెంచి పోషించిన అరాచక శక్తుల్లో ఒకరు. గుంటూరులోని వేళాంగినగర్కు చెందిన ఇతను గత ఐదేళ్లలో సాగించిన ఆగడాలు.. దందాలు.. చేసిన దౌర్జన్యాలు అన్నీఇన్నీ కావు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్, నారా లోకేశ్ తదితరులను అరగంటలో లేపేస్తానంటూ పేట్రేగిపోయారు. వారి కుటుంబసభ్యులను ఉద్దేశించి నీచాతినీచంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తి పీచమణచనివ్వకుండా నాడు వైకాపా పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు చేతులు కట్టేశారని పోలీసు అధికారులు అప్పట్లో చెప్పేవారు.
మరిప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్చనిచ్చింది. మీ విధుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల అనిల్పై కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ విధులను మరచి వ్యవహరించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికీ వైకాపా వాసనను వదిలించుకోని కొంతమంది పోలీసులు… అరాచక శక్తులతో అంటకాగుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా చేస్తున్నట్టు ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి..

గత నెల 26 నుంచి 29 వరకు అరండల్పేట పోలీస్ కస్టడీలో ఉన్న అనిల్కు ప్రత్యేక పడక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేనల్లుడితో సిబ్బంది ఎదుటే మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. పైగా అతని వెంట సెల్ఫోన్ తీసుకొచ్చినా సిబ్బంది అడ్డు చెప్పకపోవడం గమనార్హం. అంతేకాదు.. కుర్చీలో కూర్చుని.. ఓ కానిస్టేబుల్కు ఎదురుగా బల్ల మీద ఉన్న పేపరు ప్రింటు తీసుకొచ్చి ఇవ్వాలని ఆర్డర్ వేయగానే ఆయన వెంటనే వెళ్లి తెచ్చిచ్చినట్టు వీడియో ఫుటేజీలో స్పష్టంగా ఉంది. మరో కానిస్టేబుల్తో అరగంట సేపు మంతనాలు జరిపిన విషయంపైనా వీడియో ఉందని ప్రచారం జరుగుతోంది.

• స్టేషన్ సీఐ గదినీ, అక్కడున్న మరుగుదొడ్డినీ బోరుగడ్డ వాడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

• రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఫోన్ల ద్వారా వైకాపా నాయకులతో మంతనాలు సాగించినట్టు విశ్వసనీయ సమాచారం.

• ఇటీవల రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకెళ్తూ నిందితుడికి ఓ రెస్టారెంట్లో మాంసాహారం పెట్టించిన ఎస్కార్ట్ పోలీసులు సస్పైండైన సంగతి తెలిసిందే. పోలీసులు అనిల్ కుమ్మక్కయినట్టు చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మరువకుండానే అరండల్పేట పోలీసుల వ్యవహారశైలిపై వీడియోలు బయటకొచ్చాయి. సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా సిబ్బంది అలా ప్రవర్తించడం వెనుక కారణాలేమిటి? స్టేషన్ అధికారికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

• రిమాండ్ ఖైదీలకు భోజనం, తాగునీరు, అనారోగ్యం పాలైతే వైద్యసేవలు అందించాలని మాత్రమే కోర్టు నిబంధనలు ఉంటాయని నిద్రపోవటానికి బల్ల, దిండు, కుర్చీలో కూర్చొనే సౌకర్యం వంటివి కల్పించాలని ఉండవని పోలీసువర్గాలు చెబుతున్నాయి.

• ఏ స్టేషన్లో ఏం జరుగుతుందో ఎస్పీకి సమాచారమివ్వటానికి స్పెషల్ బ్రాంచి విభాగం ఉంది. అనిల్ అరెస్టు.. విచారణలు వంటివి రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఆయన్ని అరండల్పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఎలా విచారిస్తున్నారని నిఘా పెట్టి ఉంటే వీటికి తావుండేది కాదు. అర్ధరాత్రి వేళ మేనల్లుడు స్టేషన్లోకి వచ్చి మాట్లాడి వెళ్లాడని, పగలు రాలేదని ఎస్బీ వర్గాలు చెబుతున్నాయి. పైగా అతను సెల్ ఫోన్ తో రావటం గమనార్హం.

•  అనిల్ కు అతని మేనల్లుడితో ములాఖత్ కు అవకాశం ఇచ్చిన అరండల్పేట పోలీసులపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఏఎస్పీతో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే స్టేషన్లో నిందితుడికి ప్రత్యేక పడక ఏర్పాటు చేసిన ఉదంతంలో సీఐ కొంకా శ్రీనివాసరావును వీఆర్కు పంపించారు. సీసీ టీవీ ఫుటేజీలు బయటకు వెళ్లడంపైనా విచారించాలని స్పష్టం చేశారు. టెక్నీషియన్ తో సంబంధాలున్న ఓ కానిస్టేబుల్ ఫోన్ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపాలని ఏఎస్పీని ఆదేశించారు.

Also read

Related posts

Share via