March 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు!


తెలంగాణ భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అవి పెట్రోల్ బాంబులు కాదని, డోర్ కిందనుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఏ నష్టం జరగలేదు.

Bomb attack: తెలంగాణ ఖమ్మంలో మరో భయంకర సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సూపరింటెండెంట్ ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసరడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొంత ఫర్నిచర్ కాలిపోగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.

కాలిబూడిదైన ఫర్నిచర్..
ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. అయితే వారు పెట్రోల్ బాంబులు విసరలేదన్నారు. తన ఛాంబర్ గది తలుపు కింద నుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు చెప్పారు. కొంత ఫర్నిచర్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి రోగులకు ఎలాంటి హానీ జరగలేదన్నారు. ఎలాంటి నష్టం కూడా వాటిల్లలేదని చెప్పారు.

పెట్రోల్ బాంబుతో దాడి జరిగిందనేది అవాస్తవం. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు. నా ఆఫీస్ రూమ్ లక్ష్యంగా చేసుకుని నిప్పంటించారా? లేక మతిస్థిమితం లేని వ్యక్తులు ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని రామకృష్ణ తెలిపారు.

Also read

Related posts

Share via