SGSTV NEWS
InternationalOperationSindoor

BLA : పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా మద్దతు.. BLA సంచలన ప్రకటన!


పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ  ప్రకటన కీలకంగా మారింది.

పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ  ప్రకటన కీలకంగా మారింది. చర్చల అనంతరం పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే అందుకు తాము మద్దతిస్తామని వెల్లడించింది.  భారత్ కు సైనిక శక్తిగా నిలుస్తామని..  పశ్చిమ సరిహద్దు నుంచి పాక్ పై దాడి చేస్తామని స్పష్టం చేసింది.  పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని, ప్రాంతీయ సైనిక, రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీ అని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శాంతి మరియు కాల్పుల విరమణ ప్రకటనలను బీఎల్ఏ మోసంగా అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని తెలిపింది.

Also read

Related posts

Share this