మీర్‌పేట్‌లోని హస్తీనాపురంలోనది దావత్ హోటల్‌లో బిర్యానీ బాగోలేదని చెప్పిన కస్టమర్‌పై విచక్షణారహితంగా కొట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హోటల్ సీజ్ చేసి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
TG News: హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బిర్యానీ.. సరదాగా బిర్యానీ తిందామని వెళ్లిన వారికి షాక్ తగిలింది. హోటల్ యాజమాన్యం ఇష్టానుసారం రక్తం వచ్చేలా దాడి చేసిన ఘటన మీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. హస్తీనాపురంలోనది దావత్ బిర్యానీ హోటల్ సిబ్బంది కస్టమర్ల పట్ల కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారు. బిర్యానీ తిందామని వచ్చిన వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
యాజమాన్యంపై కేసు నమోదు:
దావత్ హోటల్‌లో బిర్యానీ తిందామని కొందరు వెళ్లారు. వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ అస్సలు బాగోలేకపోయే సరికి సిబ్బందితో చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన మేనేజర్ దగ్గరుండి మరీ వారిపై సిబ్బందితో దాడి చేయించాడు. రక్తం వచ్చేలా చితకబాదారు. విషయం కాసేపటికే అందరికీ తెలిసిపోయింది. కస్టమర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగిలచే ప్రయత్నం చేశారు.
కస్టమర్లకు తీవ్రగాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా దావత్ హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్లను ఇంత తీవ్రంగా కొడతారా అంటూ మిగతా కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హోటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హోటల్‌ను సీజ్ చేయాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
నగరంలో ఆహారం కల్తీ అవడం, పలు హోటళ్లలో బిర్యానీలో పురుగులు రావడం, బొద్దింకలు రావడం, నాణ్యతపై ప్రశ్నిస్తే కస్టమర్లను నిర్వాహకులు చితకబాదుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేస్తూనే ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా హోటళ్లలో కుళ్లిన మాంసం గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాహోటళ్ల తీరు మారడం లేదు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..