ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు
YS Viveka Murder Case: వీడని మిస్టరీగా మారిన వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు ఉన్నారు. ఇక 2023లో ఈ నలుగురు దస్తగిరిని తీవ్ర ఇబ్బందికి గురిచేసినట్లు బయటపడగా పులివెందుల(Pulivendhula) పోలీసులు చర్యలు చేపట్టారు
రామ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం..
ఈ కేసులో కడప జైలు(Kadapa Jail)లో 5 నెలలు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభివించాడు దస్తగిరి. అయితే వివేక కేసులో వైసీపీ నేతలకు సపోర్టుగా మాట్లాడాలని డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు 2023 నవంబరులో కడప జైలుకు వచ్చిన డాక్టర్ చైతన్య రెడ్డి.. CBI ఎస్పీ రామ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు దస్తగిరి బయటపెట్టాడు
రూ.20 కోట్ల డీల్..
రామ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే రూ.20 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టినట్లు ఫిర్యాదులో తెలిపాడు. జైలులో సూపరింటెండెంట్ ప్రకాశ్ కూడా తనను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేసినట్లు తెలిపాడు. ఇక మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డిని 2019లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వివేక కూతురు సునీతారెడ్డి(Sunitha Reddy) ఫిర్యాదు మేరకు ఈ కేసును సీబీఐ(CBI) విచారణ జరుపుతోంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025