కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్భవన్లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..’ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు.
మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్పై మండిపడుతున్నారు.
West Bengal
governor
Harassment