June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

భారతీరెడ్డి పీఏ అరెస్టు?

ఏపీ రాజకీయాల గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. వైరల్ అయ్యే పోస్టుల మీద తరచూ ఒక లుక్ వేసే అలవాటున్న వారందరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రారెడ్డి. గడిచిన ఐదేళ్లలో అతగాడు పెట్టిన పోస్టులు.. వాటిల్లోని కంటెంట్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక ముఖ్యమంత్రి సతీమణి వ్యక్తిగత సహాయకుడి సోషల్ మీడియా ఖాతాలో పెట్టే పోస్టుల్లో ఏ ఒక్కటి కూడా చదవటానికి వీల్లేని రీతిలో ఉండటం ఒక ఎత్తు అయితే.. అలాంటోడ్ని ఇంటి గడప తొక్కేందుకు అనుమతించటం ఏమిటో అర్థం కాదు.

Also read :భర్తకు దూరం.. ప్రియుడు కూడా అలా చేయడంతో

టీడీపీ, జనసేన మహిళా నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు ఎవరైనా సరే.. రాయలేని.. మాట్లాడలేనంత వికార భాషలో రాతలు రాయటం ఇతగాడికి అలవాటు. అలాంటి వర్రా రవీంద్రారెడ్డిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. జగన్ తో విభేదించిన వారు ఎవరైనా సరే.. చివరకు ఆయన సొంత చెల్లెలు షర్మిలతో పాటు దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతతో సహా ఎవరిని విడిచిపెట్టకుండా రోత రాతలు రాసే ఇతగాడి గురించి ఇప్పటి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గతంలోనూ వార్నింగ్ ఇచ్చేశారు.
Also read :Telangana: గుండె కుడి వైపు ఉందని భార్యను వదిలేసిన భర్త.. ఆపై ఏం చేశాడో తెలుసా..?

రోజులు లెక్క పెట్టుకోవాలని.. ఈ రోజు తానేం చేయలేకపోవచ్చని.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. తాను ఏదో ఒక రోజు బదులు తీర్చుకుంటానంటూ ఆమె గతంలో ప్రతిన చేశారు. అతగాడి ఛండాలపు రాతలను భరించలేని షర్మిల.. సునీతమ్మలు హైదరాబాద్ సైబర్ క్రైంలో కంప్లైంట్ చేశారు. అయినప్పటికి అతగాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐదేళ్లుగా అతగాడు పెట్టిన పోస్టుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మర్యాదపూర్వకంగా ఉండకపోవటం గమనార్హం. మరి.. ఇలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను ఎందుకు చేసుకుంటూ పోలేదన్నది ప్రశ్న.
Also read :ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళా వైద్యురాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు.. ఆయన భార్య గురించి నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ.. అడ్డగోలు పోస్టులు పెట్టే అతని తీరును పలువురు తప్పు పట్టేవారు. అతడి పాపాలకు వడ్డీతో చెల్లిస్తామంటూ పలువురు గతంలోనే వ్యాఖ్యలు చేశారు. చివరకు తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత.. రవీంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. గతంలో అతను పెట్టిన సభ్యత లేని పోస్టులను ప్రస్తావిస్తూ చర్యలు ఖాయమని స్పష్టం చేశారు.

Also read :ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నారా? ఇతని కథ అందరికీ గుణపాఠం!

కట్ చేస్తే.. తాజాగా ఇతగాడు పులివెందుల – కదిరి మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే.. వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం అతడ్ని పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు పోస్టుల రూపంలో పెడుతున్నారు. మరి.. ఇతను ఎక్కడ ఉన్నాడు? అన్న దానిపై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also read :Airport: ఎయిర్‌ పోర్టులో పోలీసులను చూసి వీల్‌ చైర్‌లోని 67 యేళ్ల ముసలోడి తత్తరపాటు.. కాస్త దగ్గరకెళ్లి చూడగా!

Related posts

Share via