Hyderabad Crime News: అనుమానం అనేది పెనుభూతం అనే విషయం అందరికి తెలిసిందే. ఇది శృతిమించితే.. ఎంతటి ప్రమాదం.. అనేక ఘటనలే ఉదాహరణ. ఈ అనుమానం అనే భూతం శరీరంలోకి వ్యక్తి..ఇక పశువు కంటే దారుణంగా ప్రవర్తిస్తాడు.
నేటికాలంలో దంపతుల మధ్య జరుగుతున్న చిన్నపాటి గొడవలే దారుణ ఘటనలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, ఆర్థిక సమస్యలు వంటివి దంపతుల మధ్య గొడవలకు కారణం అవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని సార్లు అనుమానం పెను భూతంగా మారి..సంసారాన్ని నాశనం చేస్తుంది. తాజాగా ఓ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్ని అమానుషంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె పాలిట యుముడిగా మారి..దారుణానికి ఒడిగట్టాడు.
అనుమానం అనేది పెనుభూతం అనే విషయం అందరికి తెలిసిందే. ఇది శృతిమించితే.. ఎంతటి ప్రమాదం.. అనేక ఘటనలే ఉదాహరణ. ఈ అనుమానం అనే భూతం శరీరంలోకి వ్యక్తి..ఇక పశువు కంటే దారుణంగా ప్రవర్తిస్తాడు. నిత్యం భార్యను చిత్రహింసలు గురి చేస్తున్న అనుమానపు భర్తలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు అయితే… ఏకంగా భార్యను చంపేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడి మారుడు. ఆమెకు అర్ధరాత్రి కాలరాత్రిగా చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో చోటు చేసుకుంది.
జనగామ జిల్లాకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు చాలా కాలం క్రితం హైదరాబాద్ కి వచ్చారు. నగరంలోని ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో రమేశ్ దంపతులు ఉంటున్నారు. చాలా కాలం పాటు వారి సంసారం ఎంతో హాయిగా సాగిపోయింది. అయితే రమేశ్ లో దూరిన ఓ చెడు బుద్ది..వారి సంసారాన్ని నాశనం చేసింది. భార్య అందంగా ఉండటంతో ఆమెపై రమేశ్ అనుమానం పెంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తరచూ ఆమెతో గొడవ పడే వాడని తెలుస్తోంది. ఈ క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం బాగా పెరిగిపోయింది.
దీంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో రమేశ్.. కమలను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఇక వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కమల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అనుమానం కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. అందుకే సంసారాల్లో, భార్యాభర్తల మధ్య అనుమానాలకు తావులేకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం