2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో ఛోటా రాజన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడి.
Chota Rajan: జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కు ఉపశమనం లభించింది. 2001 సంవత్సరం నాటి జయశెట్టి హత్య కేసులో ఛోటా రాజన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ కేసు పై విచారణ చేపట్టిన జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ లతో కూడిన డివిజనల్ బెంచ్ జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి..లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
మే 30 2024 ముంబైలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టు రాజన్ కు జీవిత ఖైదు విధించింది.సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్ ను జయాశెట్టి అనే మహిళ నిర్వహించే వారు.
అయితే ..2001 మే 4న హోటల్ లో ఉన్న సమయంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈ హత్య కేసు విచారణలో చోటా రాజన్ చేయించినట్లు తేలింది.
సెక్యూరిటీని తొలగించిన..
ఆమెను హత్య చేయడానికి ముందు చోటా రాజన్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తనకు చోటా రాజన్ ప్రాణహాని ఉందని జయాశెట్టి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ కూడా కల్పించారు. అయితే ఆమెకు ఎలాంటి హానీ లేదని పోలీసులు కొన్ని రోజులకు సెక్యూరిటీ ని ఉపసంహరించుకున్నారు. సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయాశెట్టి హత్యకు గురయ్యారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





