SGSTV NEWS online
Spiritual

Ayyappa Mala Deeksha:అయ్యప్ప
మాల వేసిన వారు.. తప్పకుండా ఈ నియమాలు పాటించాలి !

Ayyappa Mala Deeksha:శబరిమలే యాత్ర కుసిద్ధమయ్యే భక్తులు పాటించే అత్యంత పవిత్రమైన ఆచారమే.. అయ్యప్ప స్వామి ‘మాల ధారణ’ దీక్ష. 41 రోజుల పాటు కొనసాగే ఈ కఠోర దీక్ష, భక్తుడిని భౌతిక ప్రపంచం నుంచి దూరం చేసి, ఆధ్యాత్మిక శుద్ధికి, మనో నిగ్రహానికి, స్వామి సన్నిధికి చేరుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ దీక్షలో తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దీక్షా కాలం :

దీక్ష సాధారణంగా 41 రోజులు ఉంటుంది. కార్తీక మాసం మొదటి రోజున దీక్ష ప్రారంభించి.. మకర సంక్రాంతి రోజున శబరిమల యాత్ర ముగుస్తుంది. 41 రోజుల కంటే తక్కువ సమయం కూడా దీక్ష తీసుకోవచ్చు. గురు స్వామి.. దీక్షను ప్రారంభించేటప్పుడు, తొలిసారి మాల ధరించే భక్తులు తప్పనిసరిగా గతంలో శబరిమల యాత్ర చేసిన గురు స్వామి (కనీసం 18 సార్లు యాత్ర చేసినవారు) చేతుల మీదుగా మాల ధరించాలి. గురు స్వామి అనుమతితోనే భక్తులు మాల ధారణ చేస్తారు.సాధారణంగా తులసి, రుద్రాక్ష లేదా స్పటిక మాలలను ధరిస్తారు.

అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన ముఖ్య నియమాలు:

‘బ్రహ్మచర్యం, సత్యం, అహింస, అపరిగ్రహం, అస్తేయం’ అనే పంచ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి.మాల ధరించిన వారు 41 రోజులు సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను అమ్మగా, ఆడపిల్లలను సోదరిగా భావించాలి. భార్యా బిడ్డలకు కూడా దూరంగా ఉండాలి. మద్యం, పొగాకు, మాంసాహారం వంటి వాటిని పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

స్నానం, శుభ్రత: రోజుకు కనీసం రెండు సార్లు

(ఉదయం, సాయంత్రం) చన్నీటి స్నానం చేయాలి.నిత్యం శుభ్రమైన, నలుపు లేదా కాషాయ రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. మాల ధరించిన రోజు నుంచి యాత్ర ముగిసే వరకు చెప్పులు ధరించకూడదు. అంతే కాకుండా గడ్డం, మీసాలు తీయడం లేదా జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. గోర్లు కూడా తీయకూడదు.

మానసిక నిగ్రహం: ఎవరి పట్ల కోపం, ద్వేషం, అసూయ

వంటివి చూపకూడదు. మృదువైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అంతే కాకుండా ఉదయం, సాయంత్రం స్వామి అయ్యప్పకు తప్పనిసరిగా పూజ చేయాలి.భక్తి శ్రద్ధలతో ‘శరణం అయ్యప్ప’, ‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’ అని నిరంతరం నామస్మరణ చేయాలి. నేలపై మాత్రమే పడుకోవాలి.

పిలుపు: మాల ధరించిన వారిని ‘స్వామి’ అని మాత్రమే

సంబోధించాలి. వారు కూడా ఇతరులను ‘స్వామి’ అని పిలవాలి. శబరిమల యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని, అయ్యప్ప స్వామి దర్శనం అయిన తరువాత, గురు స్వామి లేదా ఇంటి దేవాలయంలో మాలను తీసి, దీక్షను విరమించుకుంటారు. ఈ కఠిన నియమాలను నిష్ఠగా పాటించడం ద్వారానే భక్తులు స్వామి అనుగ్రహాన్ని పొంది, శబరిమల యాత్రకు అర్హులవుతారు.

గురు స్వామి కనుమూరి సుబ్బారావు స్వామి.. నిడదవోలు

Related posts