SGSTV NEWS
CrimeTelangana

Telangana: దారుణం.. అధికారుల వేధింపులు.. నడిరోడ్డుపై కుటుంబంతో సహా ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం?


రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన దారుణ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తాతా ఆస్తి దస్తాల కోసం రెవెన్యూ అధికారి లంచం అడగడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

Telangana: మహబూబ్‌నగర్‌(Mahabubnagar )లో తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారుల(Revenue Officer) వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన శంకర్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే తన తాత పేరు మీద ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరు మీద మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని కోసం అతను దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే సిబ్బంది తన దరఖాస్తు అందలేదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఆర్డీఓ కార్యాలయానికి పంపించినప్పటికీ ఆఫ్ లైన్‌లో దస్త్రాలు అందలేదని చెప్పడంతో ఆటో డ్రైవర్ శంకర్ చాలా ఇబ్బందులు పడ్డాడు.

లంచం డిమాండ్ చేశారని..
పొలం పని పూర్తి కావాలంటే రూ.15 వేలు లంచం అడిగాడని శంకర్ ఆరోపించాడు. అప్పటికీ రూ.5 వేలు ఇవ్వగా మొత్తం డబ్బులు ఇస్తేనే మిగతా పని జరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారి తెలిపాడని ఆటో డ్రైవర్ అన్నాడు. దీంతో ఆటో డ్రైవర్ మనస్తాపానికి గురై తన భార్య జ్యోతి, ముగ్గురు కూతుళ్లపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. అయితే ప్రమాదవశాత్తు పెట్రోల్ పోసుకున్న వెంటనే ఆటోకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో శంకర్ చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతని భార్య, పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటనతో రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారి సాహత్‌ను అధికారులు ప్రశ్నించారు. దీంతో అతను పూర్తి వివరణ ఇచ్చారు. శంకర్ రెండు నెలల క్రితమే ఇనాం భూమికి సంబంధించిన ఓఆర్‌సి తెచ్చుకున్నాడని, ఆ తర్వాత తాను విచారణ జరిపి దస్త్రం పంపించానని సాహత్ తెలిపారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిందని, కానీ ఆఫ్ లైన్ దస్త్రాలు సంబంధిత సెక్షన్ నుంచి వెళ్లాలని చెప్పారు. శంకర్ నుంచి తాను ఎటువంటి డబ్బులు డిమాండ్ చేయలేదని సాహత్ స్పష్టం చేశారు. అయితే ఇందులో నిజం లేదని ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు.

Also read

Related posts

Share this