March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

Attempted murder : మైనర్‌ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని……


వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఇది ఒక భిన్నమైన ప్రేమకథ

Attempted murder : వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఇది ఒక భిన్నమైన ప్రేమకథ. 

నాలుగేళ్లుగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని.. నేరుగా ప్రియురాలి తండ్రికే ఓ ప్రియుడు ప్రపోజల్ పెట్టాడు. విషయం వినగానే ఏ తండ్రైన ఆవేశపడుతాడు. అలా అడిగిన అబ్బాయిమీద చేయి చేసుకుంటాడు. లేదా అబ్బాయి బాగుంటే అబ్బాయి జాబ్, కుటుంబం, ఆస్తితో పాటు ఇతర విషయాలను ఎంక్వైరీ చేసి ఒకే అనుకుంటే ఒకే అని, లేదంటే లేదు అని చెబుతారు. అయితే ఇక్కడ అవేమీ అడ్డుకాలేదు. కానీ పెళ్లికి వచ్చిన సమస్య వయస్సు. ఎందుకంటే ఆ ప్రపోజల్‌ పెట్టిన యువకుడి వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇంకా నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నా అని చెప్పడం అంటే 12 ఏళ్ల వయస్సునుండే ప్రేమిస్తున్నట్లు. ఇక ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే ఆ బాలిక వయస్సు కూడా 16 ఏళ్లే.

అయితే ఇదంతా విన్న తండ్రి ఏమాత్రం ఆవేశపడలేదు. చిన్నవయస్సు పిల్లతనంతో అలా అడిగాడు అనుకున్న ఆయన ఏ మాత్రం ఆవేశపడకుండా సింపుల్‌గా పెళ్లీడు వచ్చాక చూద్దాంలే అని చెప్పి పంపించివేశాడు. ఇక్కడి వరకు బానే ఉంది. అలా చెప్పడమే ఆ తండ్రి చేసిన తప్పయింది.ఆ పిల్లవయస్సు వెనుక ఒక రాక్షసుడు దాగిన్నాడని గుర్తించలేకపోయాడు. వయసు విషయం పక్కన పెట్టి పెళ్లికి అంగీకరించలేదని బాలిక తండ్రిపై పగ పెంచుకున్నాడు. అంతే కాదు తన పెళ్లికి అడ్డంగా ఉన్న ఆయనను తప్పించాలని ప్లాన్‌ చేశాడు. ఏకంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో కలకలం రేపింది.

వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ బాలుడు మేస్త్రీగా పని చేస్తున్నాడు. బాలుడు ఉంటున్న అదే కాలనీకే చెందిన బాలికను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని బాలికను అడుగగా ఆమె అంగీకరించలేదు. దీంతో నేరుగా బాలిక తండ్రి వద్దకు వెళ్లి తమకు పెళ్లి చేయమని అడిగాడు. బాలుడి మాటలకు విస్తుపోయిన బాలిక తండ్రి ఇద్దరి చిన్నపిల్లలని, పెళ్లీడు వయస్సు రాలేదని ఆ వయస్సు వచ్చాక మాట్లాడదామని నచ్చజెప్పి పంపించేశాడు. దాంతో ఆయనపై కోపం పెంచుకున్న బాలుడు వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. శనివారం అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న బాలిక తండ్రిపై కత్తెరతో దాడిచేసి, పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితోపాటు, అతడికి సహకరించిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాను అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించినట్టు నిర్మల్ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. 

Also read

Related posts

Share via