పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్ చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పీ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు.
దాచేపల్లి : పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు… గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ఆటో జానీ బుధవారం గురజాల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాసు మహేష్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై వచ్చారు. మద్యం తాగి అదే గ్రామానికి చెందిన యూసఫ్ ఇంటి ముందు గొడవ చేశాడు.
అంతటితో ఆగకుండా ఆయన బంధువు నబిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం రాత్రి దాచేపల్లి పోలీసులు యూసఫ్ను, నబిని స్టేషన్కు పిలిపించి విచారిస్తుండగా.. స్థానిక సర్పంచి ఇమామ్ వలి, ఆయన తమ్ముడు నాగులుతో కలిసి ఆటో జానీ అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలోనే యూసప్పై దాడి చేశారు. ‘ఇంకా 18రోజులు వైకాపాకు అధికారం ఉంది. ఎవరు వస్తారో రండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన యూసఫ్ను 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025