SGSTV NEWS
CrimeTelangana

ఉప్పల్ లో ఎస్ఐ పై దాడి..కాలర్ పట్టుకొని…


బోనాల పండుగ డ్యూటీలో ఉన్న ఉప్పల్ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. రామంతపూర్ బోనాల ఉత్సవాల్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్‌ నేతలు దాడి చేశారు. ఎస్సై మధుసూదన్, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్ అతని అనుచరులు దాడి చేశారు.

Attack on SI in Uppal:
బోనాల పండుగ డ్యూటీలో ఉన్న ఉప్పల్ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. రామంతపూర్ బోనాల ఉత్సవాల్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పై బీఆర్ఎస్‌ నేతలు దాడి చేశారు. వెంకట్ రెడ్డి నగర్ లో బందోబస్తులో ఉన్న ఎస్సై మధుసూదన్, కానిస్టేబుల్ పై బిఆర్ఎస్ నాయకుడు అనిల్ అతని అనుచరులు దాడి చేశారు. రామంతాపూర్ భరత్ నగర్,వెంకటరెడ్డి నగర్‌లో ఆదివారం రాత్రి కిరణ్ డైమండ్ ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ఉప్పల్ సీఐ ఆదేశాలతో ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుళ్లు బందోబస్తుకు వెళ్లారు.

ఊరేగింపు సమయంలో ఓట్స్ వ్యాగన్ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ జనంపైకి వచ్చిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బయపడిన యువకులు కారు వదిలి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత మద్యం మత్తులో అనిల్‌ అక్కడికి వచ్చి కారు తనదంటూ దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అతడిని, కారును ఉప్పల్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

ఈ క్రమంలో కొంత మంది యువకులు వచ్చి విధినిర్వహణలో  ఉన్న పోలీసులను కాలర్ పట్టుకొని కర్రలతో దాడి చేశారు. దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దాడి చేసిన అనిల్, లక్ష్మణ్, రామరాజు, క్రాంతితోపాటు మరికొందరిపై  ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో లక్ష్మణ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read

Related posts

Share this