Karimnaga Crime News: ఈ మధ్య కాలంలో డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషులకు ఇవ్వడం లేదు.మనిషి డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నాడు. ఇటీవల మానవత్వం మర్చిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
Also read :8వ తరగతి విద్యార్థికి ప్రైవేట్ ఫోటోలు పంపిన టీచర్.. ఆ తరువాత!
డబ్బుకు లోకం దాసోహం.. కొంతమంది డబ్బు కోసం ఎలాంటి దుర్మార్గాలకైనా పాల్పపడుతున్నారు. ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రులు, తోబుట్టువులను హతమార్చుతున్న దారుణ ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గత ఆదివారం రాత్రి గంగాధర మండలంల గర్శకుర్తి గ్రామంలో ఎమ్మెస్సీ విద్యార్థిని చిందం మాధవి అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు సొంత బంధువులు ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.
Also read :భార్య సంతోషంగా ఉండటం చూడలేక భర్త దారుణం! నమ్మించి మరీ!
ఒక్క తల్లి కడుపున పుట్టి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన తోబుట్టువును ఆస్తి కోసం మోసం చేసింది.. ఆమె హత్యకు కారణం అయ్యింది. తోడ బుట్టిన చెల్లెల్ని భర్త హతమార్చుతుంటే చూస్తూ ఉండిపోయింది..పైగా ఈ విషయాన్ని గుట్టుగా దాచింది. మానవ సంబంధాలు మనుగడను ప్రశ్నిస్తున్న ఈ దారుణం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిందం మాధవి(23) ఎమ్మెస్సీ చదువుతూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. ఆమె తల్లి మానసికంగా బాధపడుతుంది.ఈ మధ్యనే నుస్తుల్లాపూర్ లోని మాధవి అక్క గుండా మానస ఇంటికి వెళ్లింది. మాధవి వేరే వ్యక్తితో ఉండటం మానస ఆమె భర్త ఆంజనేయులు భరించలేకపోయారు. అంతేకాదు ఆమెను హతమార్చితే ఆస్తి తమకే దక్కుతుందని దురాభిప్రాయానికి వచ్చారు.
Also read :తుపాకీతో భార్య కాల్చివేతl
ఈ నెల 14 న రాత్రి మాధవి ఇంటికి వెళ్లి తనకు ఉన్న 12 గుంటల ఆస్తి గురించి నిలదీశారు. ఆ విషయంలో ఆంజనేయులు, మాధవికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. తన చెల్లెల్ని చంపుతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు మాధవి.ఆ రోజు రాత్రి ఏమీ తెలియనట్లు తమ ఇంటికి వెళ్లిపోయారు. అయితే మాధవి మృతిపై గ్రామస్థులకు అనుమానం రావడంతో మృతురాలి మేనమామ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి తమదైన శైలిలో అక్క, బావలను ప్రశ్నించగా అసలు రహస్యం బయట పెట్టారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి కోర్టులో హాజరు పరిచారు
Also read :బంక్ ఓనర్.. ప్లాంట్ ఓనర్.. ఒక్కరే.. ఇది మామూలు దందా కాదుగా.. గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి..