SGSTV NEWS
Andhra PradeshCrime

Eluru: ఏలూరులో వసతి గృహం ముసుగులో అకృత్యాలు.. బాలికలపై లైంగిక దాడులు



వసతి గృహం ముసుగులో ఓ కామాంధుడు బాలికలపై లైంగిక దాడులకు దిగాడు. ఫొటోషూట్లంటూ ఆశ చూపి, మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు.



ఏలూరు : వసతి గృహం ముసుగులో ఓ కామాంధుడు బాలికలపై లైంగిక దాడులకు దిగాడు. ఫొటోషూట్లంటూ ఆశ చూపి, మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. జిల్లాకేంద్రం ఏలూరులో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉండేది. సుమారు 50 మంది ఇక్కడ వసతి పొందుతూ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా ఏలూరువాసి శశికుమార్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్గా వ్యవహరిస్తున్నాడు. ఏలూరు జడ్పీ కూడలిలో ఫొటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. వసతిగృహం వద్ద వార్డెన్గా తన రెండో భార్యను, సంరక్షకురాలిగా మేనకోడలిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు  కొనసాగిస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు మంగళవారం రాత్రి రెండో పట్టణ పోలీసుస్టేషన్ ను ఆశ్రయించారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఫొటోషూట్ అంటూ ఈనెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న వసతిగృహంలో దింపాడని వాపోయారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ ్కుమార్ వసతిగృహాన్ని పరిశీలించారు. బాలికల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు, అతడికి సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిసింది.

Also read

Related posts

Share this