బాపట్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ మహిళ తన భర్తను చంపేసింది.. మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య అరుణ రోడ్డుపై అతన్ని తీవ్రంగా కొట్టి.. తాడును గొంతుకు బిగించి ప్రాణాలు తీసింది.
Bapatla : బాపట్ల జిల్లాలో పట్టపగలే దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డు మీద భర్తను భార్య తీవ్రంగా కొట్టి ఉరేసి చంపిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమరేందర్ ,అరుణ కుటుంబం గత కొంతకాలంగా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో నివాసం ఉంటోంది
అయితే గురువారం ఇద్దరు ఒక్కసారిగా రోడ్డు మీదకుల వచ్చి గొడవకు దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో గట్టిగా కొట్టింది. దీంతో అమరేందర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
గొంతుకు తాడుతో ఉరేసి..
అక్కడితో ఆగకుండా వెంటనే అమరేందర్ గొంతుకు తాడుతో ఉరేసింది. దీంతో భర్త అమరేందర్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు.
గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




