March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏపీలో దారుణం.. నోరు మూసి… పొదల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై

కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో బాలికలపై లైంగిక  దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్నకు పాల్పడిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాసానిగూడేనికి చెందిన బాలిక సమీపంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక.. బయటకు వెళ్లిన తన తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రాజుపేటకు చెందిన తలాహ్, అతని స్నేహితుడు కలిసి బాలికను బెదిరించి బలవంతంగా బైక్పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువకులున్నారు. నలుగురు కలిసి బాలికను తీవ్రంగా హింసించి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక వారి నుంచి తప్పించుకుని పెద్దగా కేకలు వేయడంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.



తండ్రి వద్దకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా.. బాలిక ఏడుస్తూ వారికి ఎదురొచ్చింది. బాలిక తల్లి ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు జిల్లా ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు.

Also read

Related posts

Share via