ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు.
Atrocious : ఆస్తులు, డబ్బు, అంతస్తుల నీడన అత్మీయతలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అనే బంధాలు కానరానివవుతున్నాయి. దీంతో మనిషి అనేవాడు మాయమై, మానవత్వం మంటగలిసి మారణహోమానికి దారితీస్తోంది. ఆస్తి కోసం అన్నాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఇద్దరు అక్కాచెల్లెల్లు అన్నను కొట్టి చంపారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జిల్లా కేంద్రం పోచమ్మ వాడలో ఉండే జంగిలి శ్రీనివాస్ అతని చెల్లెళ్లు శారద, వరలక్ష్మిల మధ్య కొంతకాలంగా ఆస్తిపరమైన విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు ఘర్షణ పడ్డారు. కాగా ఆస్తి తగదాలతో ఇటీవల అన్నపై ఇద్దరు చెల్లెళ్లు శారద, వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జంగిలి శ్రీనివాస్ ను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనవాస్ ఈరోజు (ఫిబ్రవరి 23) న మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరు పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కాగా ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు