SGSTV NEWS
Astro Tips

Venus Transit 2025: గమనాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. అదృష్టం, డబ్బు అన్నీ ఈ 3 రాశుల సొంతం



వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, సౌకర్యం, కళ, ప్రేమ, వైభవానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. ఈ గ్రహం వ్యక్తి జీవితంలో సంపద, భౌతిక ఆనందం, అందానికి సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తుంది. అందుకే శుక్రుని గమనంలో మార్పు ప్రతి ఒక్కరి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.



జ్యోతిషశాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు, ఆనందానికి మూలమైన శుక్రుడు అక్టోబర్ 9న తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. బుధుడు అధినేత అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు మధ్య స్నేహం కారణంగా ఈ సంచారము అన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని భౌతిక ఆనందం, వివాహ జీవితం, కళలకు కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కారకంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి మార్పు కారణంగా అదృష్టం ప్రకాశించే కొన్ని రాశులున్నాయి. శుక్ర సంచారము వలన సంపద, పురోగతిని పొందే అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకోండి.

వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శుక్ర సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చాలా కాలంగా ఏదైనా పని విషయంలో అడ్డంకి ఏర్పడుతుంటే అది కూడా తొలగిపోతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందవచ్చు. ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు తమ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరు స్వయం కృషితో డబ్బు, గౌరవం రెండింటినీ సంపాదిస్తారు.

సింహ రాశి ఈ శుక్ర సంచారము సింహరాశి వారికి ఒక వరం లాంటిది. శుక్రుని ప్రభావం వల్ల అకస్మాత్తుగా డబ్బు సంపాదించవచ్చు. ఎప్పటి నుంచో రాని డబ్బులు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆఫీసులో పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి. దీని కారణంగా వీరు పదోన్నతి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా.. ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు.




ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి శుక్రుని రాశి మార్పు అదృష్టానికి ద్వారాలు తెరుస్తుంది. వీరు ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ అద్భుతమైన విజయాన్ని పొందుతారు. కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే.. ఇది చాలా శుభ సమయం. వీరు చేపట్టిన ప్రతి పని విజయం అవుతుంది. స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వివాహ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది

Also read

Related posts

Share this