SGSTV NEWS
Astro TipsSpiritual

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!




2025లో వరలక్ష్మీ వ్రతాన్ని హిందువులందరూ ఆగస్టు 8న జరుపుకోనున్నారు. అయితే ఈ సారి వరలక్ష్మీ వ్రతం తర్వాత కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందంట. చాలా రోజుల నుంచి ఎవరైతే కష్టాలతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడటమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కూడా వీరికి కలిసి రానున్నదంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



మిథున రాశి : మిథున రాశి వారికి వరలక్ష్మీ వ్రతం తర్వాత కష్టాల నుంచి విముక్తి లభిస్తుందనే చెప్పాలి. అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి దూరప్రయాణాలు చేయాలి అనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తులకు  అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు అందుకుంటారు. సంతోషంగా గడుపుతారు.


ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. కళ రంగంలో ఉన్న వారు మంచి ప్రతిభను కనబరిచి తన పై ఉన్నవారి నుంచి ప్రశంసలు పొందుతారు. ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది.


సింహ రాశి : వీరికి వరలక్ష్మీ వ్రతం తర్వాత  పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది.



వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో చింత అవసరం లేదు.  ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. జీతం పెరగడంతో ఆనందంగా గడుపుతారు.

Related posts

Share this