April 28, 2025
SGSTV NEWS
Astro TipsAstrology

Sun Transit: గ్రహ రాజు రవి అనుకూలత.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి

 

Telugu Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవికి చాలా ప్రాధాన్యత ఉంది. రవి అనుకూలంగా ఉంటే సగం సమస్యలు పరిష్కారమైనట్లే. ప్రస్తుతం రవి మేష రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. మే 14 లోపు కొన్ని రాశుల వారు వారు వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి, సంతాన యోగం లాంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి.

జాతకంలో రవి అనుకూలంగా ఉంటే సగం సమస్యలు పరిష్కారమైనట్టేనని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గ్రహరాజైన రవి సరైన స్థానంలో ఉంటే అటువంటి వారి జీవితంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ అత్యున్నత స్థానాలను అధిరో హించాలంటే రవి బలం చాలా అవసరం. రవి బలంగా ఉంటే ఎటువంటి సమస్యయినా అతి తేలికగా పరిష్కారమవుతుంది. ప్రస్తుతం రవి మేష రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందు వల్ల మే 14 లోపల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశులవారికి కొన్ని కీలక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.

👉   మేషం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి వల్ల ఈ రాశివారికి తప్పకుండా వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పదోన్నతులు తప్పకుండా లభిస్తాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ చూపించడం ప్రారంభిస్తారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మనసులోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు తీరుతాయి.

👉  మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.

👉  కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రతికూలతలు తగ్గి, సానుకూలతలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి.
సింహం: ఈ రాశికి నవమ స్థానంలో రాశ్యధిపతి రవి ఉచ్ఛపట్టడం వల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ మూలక వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసివస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

👉  వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. తండ్రితో విభేదాలు తొలగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి.

👉  ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు, అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి

Related posts

Share via